- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > రోడ్డెక్కిన విద్యార్థులు, ఉద్యోగులు.. బస్సు సర్వీసు నిలిపివేతపై నిరసన
రోడ్డెక్కిన విద్యార్థులు, ఉద్యోగులు.. బస్సు సర్వీసు నిలిపివేతపై నిరసన
by Kodari Anjali |
బస్సు సర్వీసు నిలిపివేతపై విద్యార్థులు, ఉద్యోగులు ఆర్టీసీ బస్సు ఎదుట నిరసన తెలిపారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి: పోచంపల్లి నుండి హైదరాబాదుకు నడిచే ప్రైవేటు అద్దె బస్సుల కాల పరిమితి ముగియడంతో అధికారులు సర్వీసులను నిలిపివేశారు. దీంతో శుక్రవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ లో గల ప్రధాన చౌరస్తా వద్ద విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ప్రయాణికులు గ్రామానికి వచ్చిన బస్సును అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం పోచంపల్లి నుండి హైదరాబాదుకు వందల సంఖ్యలో ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాలకు ప్రయాణం చేస్తుంటారని, నిలిపివేసిన నైట్ అవుట్ బస్సు సర్వీస్ ను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేస్తూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసులను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Next Story






