గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-12 08:47:22  IST  )

జనగణన విధుల్లో ఉండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందిన ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాదులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల తెలుగు అధ్యాపకుడు అనపర్తి శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.‌

గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ మృతి
X

దిశ, ఘట్కేసర్: జనగణన విధుల్లో ఉండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందిన ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాదులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల తెలుగు అధ్యాపకుడు అనపర్తి శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తెలిపారు.‌ శుక్రవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ నెంబర్ సర్కిల్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తుండగా మే 22న తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది అలాగే విధులు నిర్వర్తిస్తూ తీవ్ర ఎండ దెబ్బతో ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు‌ ప్రిన్సిపాల్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల, రామచంద్రాపురంకు చెందిన శ్రీనివాస్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని బాధిత కుటుంబాన్ని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది కలిసి పరామర్శించినట్లు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరినట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ చెప్పారు.

Next Story