- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్‌లో CMR స్కూల్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి.. క్రికెట్ ఆడి సందడి!
మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

దిశ,మేడ్చల్ : మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. బ్యాటింగ్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని, వారికి కృతజ్ఞతగా వారి పిల్లలకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక సీఎంఆర్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విద్యాసంస్థలను విస్తరిస్తున్నామని, అవసరమైతే మేడ్చల్ ప్రజల కోసం మరిన్ని సీఎంఆర్ పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి, మూడు చింతల పల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష్,మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు రాజ మల్లారెడ్డి, జగన్ రెడ్డి, దయానంద్ యాదవ్, సురేష్ రెడ్డి, సుదర్శన్, వెంకటేష్, శ్రీనివాస్ రాజు, రందీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి, నర్సింగ్ గౌడ్, సందీప్ గౌడ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.






