- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీలర్ల షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు.. పురుగులు, దుర్వాసనతో ఆందోళన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, దానికంటే ముందు నెలల నుంచి డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డీలర్ల సంఘం నాయకులు తెలిపారు.

దిశ, అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, దానికంటే ముందు నెలల నుంచి డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డీలర్ల సంఘం నాయకులు తెలిపారు. రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఎక్కువ కాలంగా తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు పురుగులు పట్టాయని వారు ఆరోపించారు. ఈ పరిస్థితుల కారణంగా రేషన్ డీలర్లు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, నిల్వ ఉన్న దొడ్డు బియ్యంలో ఏర్పడుతున్న పురుగులు, కీటకాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నాణ్యమైన సన్న బియ్యానికి కూడా వ్యాపించే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలకు అందించే నాణ్యమైన సన్న బియ్యం నాణ్యతపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డీలర్ల వద్ద నిల్వ ఉన్న పాత దొడ్డు బియ్యాన్ని అత్యవసరంగా తరలించాలని, రేషన్ షాపుల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీలర్ల సంఘం కోరుతున్నారు.






