- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను ఇనుప పెనంతో కొట్టి చంపిన భార్య.. కోర్టు సంచలన తీర్పు!
భర్తను ఇనుప పెనంతో కొట్టి హత్య చేసిన కేసులో భార్యకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని 4వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.

దిశ, చంపాపేట్: భర్తను ఇనుప పెనంతో కొట్టి హత్య చేసిన కేసులో భార్యకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని 4వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితురాలిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2024లో గడ్డం నరసింహులు అనే వ్యక్తిని ఆయన భార్య ఇనుప పెనంతో దాడి చేసి హత్య చేసింది. ఘటన అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతుండగా, డయల్-100కు అందిన సమాచారంతో బహదూర్పురా పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంత్యక్రియలు నిలిపివేసి కేసును లోతుగా దర్యాప్తు చేశారు. ఘటనకు సంబంధించిన శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాలు నిందితురాలి పాత్రను స్పష్టంగా నిరూపించడంతో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు 4వ అదనపు సెషన్స్ కోర్టు నిందితురాలికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన బహదూర్పురా పోలీసుల దర్యాప్తు పై అధికారులు అభినందనలు వ్యక్తం చేశారు.






