- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టకాలంలో తోటి డ్రైవర్ కుటుంబానికి చేయూత.. అభినందించిన గ్రామస్తులు
by Jakkula.Mamatha |
అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ పస్తం రాము ఇటీవల బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

X
దిశ, అనంతగిరి: అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ పస్తం రాము ఇటీవల బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు హార్వెస్టర్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు, యజమానులు, గ్రామస్తులు ముందుకు వచ్చి రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల గ్రామంలో ప్రశంసలు వ్యక్తమయ్యాయి. కష్టకాలంలో సహచరుడి కుటుంబానికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనమని గ్రామస్తులు కొనియాడారు. దాతలు ఇంకా ఎవరైనా ఉంటే సహాయం అందించాలని, ప్రభుత్వం కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






