నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

by Jakkula.Mamatha |

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్న మూసి కెనాల్ నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.35 లక్షల వ్యయంతో శుక్రవారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
X

దిశ, సూర్యాపేట రూరల్: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్న మూసి కెనాల్ నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.35 లక్షల వ్యయంతో శుక్రవారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఇబ్బందులు పడుతూ భయంతో ప్రయాణిస్తున్న పిల్లలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణంతో గ్రామస్తుల కల నెరవేరబోతుందని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఇంకా గ్రామంలో ఏ సమస్యలు ఉన్న పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పిల్లలమర్రి అభివృద్ధే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం వేసవికాలం దృష్ట్యా గ్రామంలో తాగునీటి సమస్య ఉండడంతో వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశానుసారం గ్రామంలో బోరు వేయించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది, కౌన్సిలర్లు యక్కటి శేఖర్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల గంగాభవాని, ఇరిగేషన్ డిఈ రమేష్, ఏఈ స్వప్న, నాయకులు ఎలిమినేటి అభినయ్, గుణగంటి సతీష్, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్ రెడ్డి, కనుక వెంకన్న, చెరుకుపల్లి వెంకట్ లాల్, కోట్ల సైదులు, చెరుకుపల్లి చంద్రశేఖర్, కొండ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Next Story