- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి అనంత కిషన్
సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అనంత కిషన్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల విద్య, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల కోసం తన వంతు కృషి చేస్తానని, యువతకు మార్గదర్శకంగా ఉంటానని హామీ ఇచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ తోపాజి అనంత కిషన్‌కు అభినందనలు తెలిపారు. సంగారెడ్డి నుంచి రాష్ట్ర స్థాయి పదవి రావడం జిల్లాకు గర్వకారణమని, సంఘ బలోపేతానికి అనంత కిషన్ కృషి చేస్తారని ఆకాంక్షించారు. సంగారెడ్డి ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై అనంత కిషన్‌ను అభినందించారు.






