షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ లోని ఓ పాత ఇంటిలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ లోని ఓ పాత ఇంటిలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగాధర్ అనే కుట్టు మిషన్‌ల వ్యాపారికి చెందిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటి మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 60 కొత్త కుట్టు మిషన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లోని ఇతర సామగ్రి కూడా దగ్ధమై భారీ నష్టం సంభవించింది. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.కాగా సంఘటన స్థలాన్ని ఛైర్పర్సన్ సమిండ్ల వాణి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాలా జ్యోతి,మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, నాయకులు అడువాలా లక్ష్మణ్ తదితరులు పరిశీలించారు.

Next Story