క్లాడ్ ఫేబుల్ 5: సూపర్ ఇంటెలిజెన్స్‌తో మరో కొత్త AI మోడల్!

by Javid Pasha |

మల్టి-డే, కాంప్లెక్స్ రీసెర్చ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టాస్కులలో క్లాడ్ ఫేబుల్ 5 ఏఐ మోడల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

క్లాడ్ ఫేబుల్ 5: సూపర్ ఇంటెలిజెన్స్‌తో మరో కొత్త AI మోడల్!
X

దిశ, ఫీచర్స్ : ఏఐ సేఫ్టీ కోసం పుట్టుకొచ్చిన ఆంత్రోపిక్ టెక్నాలజీ పట్ల యూజర్లలో ఆసక్తి పెరుగుతోంది. రీసెంట్‌గా ఈ కంపెనీ (జూన్ 9, 2026న) తన అత్యంత శక్తివంతమైన క్లాడ్ ఫేబుల్ 5 అనే మోడల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇది Anthropic‌కు చెందిన Mythos-class మోడల్‌లో మొదటిసారిగా పబ్లిక్‌కు.. అంటే సాధారణ యూజర్లు, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకోసం విడుదల చేసిన వెర్షన్‌గా పేర్కొంటున్నారు. ఇంతకీ ఈ మోడల్ ప్రత్యేకతలేమిటి? ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపయోగాలివే..

ఆంత్రోపిక్ ఇంతకు ముందు మైథాస్ మోడల్ సైబర్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు క్లాడ్ ఫేబుల్ 5 (Claude Fable 5) వెర్షన్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు, పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించవచ్చు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, లాంగ్-హారిజన్ టాస్కులు, అనలిటిక్స్, సైంటిఫిక్ రీసెర్చ్ వంటి రంగాల్లో అద్భుతమైన పనితీరు చూపుతుందని నిపుణులు అంటున్నారు.

పర్ఫామెన్స్&సేఫ్టీ ఫీచర్స్

ఫేబుల్ 5 సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో అద్భుతమైన పనితీరు చూపించినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది SWE-Bench Proలో 80.3% స్కోర్ సాధించి, అనలిటికల్ బెంచ్‌మార్క్‌లో 90% పైగా క్రాస్ చేసిన మొదటి మోడల్‌గా నిలిచింది. క్లాడ్ ఒపస్ 4.8 కంటే 10% పైగా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. ముఖ్యంగా ఇది మల్టి-డే, కాంప్లెక్స్ రీసెర్చ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, లాంగ్-హారిజన్ టాస్కులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. భద్రత కోసం హై-రిస్క్ డొమైన్స్ (సైబర్ సెక్యూరిటీ, బయాలజీ, కెమిస్ట్రీ)లో ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసి, క్లాడ్ ఒపస్ 4.8కి స్విచ్ అవుతుంది. 95% సెషన్లలో ఎలాంటి ఫాల్‌బ్యాక్ లేకుండానే పని చేస్తోంది.

ఎక్కడ అందుబాటులో ఉంటుంది?

ఫేబుల్ 5 ధర ₹950 ($10) పర్ మిలియన్ ఇన్‌పుట్ టోకెన్స్, అలాగే ₹4,750 ($50) పర్ మిలియన్ అవుట్‌పుట్ టోకెన్స్‌గా ఉంది (ఒపస్ 4.8 కంటే రెట్టింపు). క్లాడ్ ప్లాట్‌ఫామ్, AWS, Google Cloud, Microsoft Foundryలో అందుబాటులో ఉంది. జూన్ 22 వరకు పెయిడ్ ప్లాన్‌లలో అదనపు ఖర్చు లేకుండా ఉపయోగించవచ్చునని కూడా సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో క్లాడ్ మైథాస్ 5 (సేఫ్‌గార్డ్స్ లేని వెర్షన్) కూడా విడుదలైంది. కానీ ఇది కేవలం వెటెడ్ సైబర్ డిఫెండర్లు, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Next Story