అక్రమ నిర్మాణంపై ఎం ఎంసీ అధికారుల కొరడా..

by Kodari Anjali |

ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్, టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణం చేపడుతున్న అనుమతి లేని వాణిజ్య కార్యకలాపాలపై ఎంఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు.

అక్రమ నిర్మాణంపై ఎం ఎంసీ అధికారుల కొరడా..
X

దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్, టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణం చేపడుతున్న అనుమతి లేని వాణిజ్య కార్యకలాపాలపై ఎంఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ, బీడీ రెడ్డి గార్డెన్, రోడ్ సమీపంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన షెడ్డును ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఏసిపి అంబికా శ్రీ, టి పి ఎస్ సాయి అర్చన, చైర్మన్లు, రాజ్ కుమార్, కృష్ణ, సెక్షన్ రైటర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ పాండు తదితర సిబ్బంది.. శుక్రవారం, సీజింగ్ చర్యలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో పాటు అవసరమైన అనుమతులు లేకుండానే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత ప్రాంగణాన్ని సీజ్ చేశారు.

పట్టణ ప్రణాళికకు విఘాతం కలగడమే కాకుండా..

గత 20 రోజుల క్రితం ఈ అక్రమ షెడ్డు నిర్మాణానికి నోటీసును జారీ చేసినట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, రోడ్లు మరియు ప్రజా స్థలాలను ఆక్రమించి నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాలు, షెడ్లు, ఇతర నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భవన యజమానులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అక్రమ నిర్మాణాల వల్ల పట్టణ ప్రణాళికకు విఘాతం కలగడమే కాకుండా ప్రజల భద్రతకూ ముప్పు ఏర్పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై సీజ్, కూల్చివేతలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. నగరంలో అక్రమ కట్టడాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని ఎంఎంసీ స్పష్టం చేసింది.

Next Story