రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-12 12:57:41  IST  )

తెలంగాణలోని మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, జనగామ తదితర జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన తుపాన్లు వచ్చే అవకాశం ఉంది.

రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల వాతావరణం (weather)లో అకస్మాత్తుగా తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ముసురు, తీవ్రమైన ఉరుములతో కూడిన తుపాన్లు (Intense Thunderstorms) సంభవించే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

భారీ వర్షాలు.. తీవ్ర ప్రభావం చూపే జిల్లాలు

తీవ్రమైన తుఫాను ప్రభావం (Intense Thunderstorms) మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలపై కనిపిస్తుంది. ఈ జిల్లాల్లో ప్రస్తుతం విస్తారంగా ఉరుములు నడుస్తుండగా.. రాబోయే రెండు గంటల్లో ఇవి భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలకు విస్తరించనున్నాయి. మరో వైపు సిద్దిపేట, జనగామ జిల్లాలో ప్రారంభమైన తీవ్రమైన తుపాన్లు, ముందుకు సాగి యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాలను కమ్మేసే అవకాశం ఉంది. వీటితో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ తీవ్రమైన వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాలలో నిలబడవద్దని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని హెచ్చరిస్తున్నారు.

Next Story