- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో దఫా దేశంలో బీజేపీదే అధికారం
కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 వసంతాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, పార్టీ నాయకులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. దేశాన్ని విశ్వగురువు గా మార్చాలని నాటి నరేంద్రుడు కళ కంటే నేటి నరేంద్రుడు నిజం చేస్తున్నాడన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజే ఓటు చోరి కి పాల్పడి నెహ్రూ ప్రధాన మంత్రి అయ్యారన్నారు. నేడు కాంగ్రెస్ నాయకులు ఓటు చోరి సీటు చోరి గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు అవినీతి పునాదుల మీద ఎదిగిన పార్టీ అన్నారు. వారసత్వ రాజకీయాలను, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరించి బీజేపీకి పట్టం కడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనకు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. బీజేపీ ఎంపీలు టైం పాస్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విప్ మాట్లాడటం బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఎంత మంది నాయకులు కల్లాల వద్దకు వెళ్లారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మరో దఫా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిలిమిటేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు విషయంతో ప్రజలు త్వరలో తీపి కబురు వింటారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, చింత సంతోష్, చొప్పదండి విద్యాసాగర్, బాసంగారి వెంకన్న, గుండ్ల జనార్ధన్, తొడుపునూరి వెంకటేశం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






