- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాలోయింగ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే.. అది సినిమాల సక్సెస్‌ను డిసైడ్ చేయలేదు: పూజా హెగ్డే
సినిమా పరిశ్రమలో కొంతమంది నటులకు సోషల్ మీడియాలో కేవలం 5 మిలియన్ల మంది ఫాలోవర్లు మాత్రమే ఉంటారు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఆమె వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలు అందడం లేదు. ఇక ఇటీవల వచ్చిన హిందీ సినిమా హై జవానీ ఇష్క్ హోనా హై’ కూడా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ నెగెటివిటీపై మౌనంగా ఉన్న పూజా హెగ్డే, తాజాగా, ఈ విషయంపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా క్రేజ్‌కు, సినిమా కలెక్షన్లకు అస్సలు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. "నాకు సోషల్ మీడియాలో 30 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అంత మాత్రాన సినిమా థియేటర్లలో 30 కోట్ల టికెట్లు అమ్ముడవుతాయని గ్యారెంటీ లేదు. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. అది సినిమాల సక్సెస్‌ను డిసైడ్ చేయలేదు" అని పూజా తేల్చి చెప్పింది.
ఇండస్ట్రీలోని అసలైన స్టార్‌డమ్ గురించి చెబుతూ.. "సినిమా పరిశ్రమలో కొంతమంది నటులకు సోషల్ మీడియాలో కేవలం 5 మిలియన్ల మంది ఫాలోవర్లు మాత్రమే ఉంటారు. కానీ థియేటర్లలో వారి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేస్తారు. వారే నిజమైన సూపర్ స్టార్లు. సినిమాలకు అదే చాలా ముఖ్యం కానీ, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కాదు" అని పూజా హెగ్డే వివరించిందిసోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోనని చెప్తూ.. అక్కడ కనిపించే అకౌంట్లలో చాలావరకు నిజమైనవి కావని, అవన్నీఫేక్ అకౌంట్లు అని కొట్టిపారేసింది. కేవలం తనను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కొందరు చేసే ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల తన కెరీర్ ఆగిపోదని, నటిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని పూజా హెగ్డే ఎంతో ధీమాగా చెప్పుకొచ్చింది.






