AI గర్ల్‌ఫ్రెండ్.. టీన్ బాయ్స్‌ను ఎందుకు ఆకర్షిస్తోంది?

by Javid Pasha |   (  Updated:2026-06-12 08:40:17  IST  )

సామాజిక ఆందోళన, ఒంటరితనం, రిజెక్షన్ భయం ఉన్న టీనేజర్స్ ఏఐ చాట్‌బాట్‌లతో ఇంటరాక్ట్ అయినప్పుడు, అవి ఎమోషనల్ సపోర్ట్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

AI గర్ల్‌ఫ్రెండ్.. టీన్ బాయ్స్‌ను ఎందుకు ఆకర్షిస్తోంది?
X

దిశ, ఫీచర్స్ : మీ టీనేజర్స్ అత్యధిక సమయం స్మార్ట్‌ఫోన్‌లోనే లీనమైపోతున్నారా? బయటి ప్రపచంపట్ల అనాసక్తిగా ఉంటున్నారా? అయితే వారు ఏఐ చాట్‌బాట్లతో సంభాషిస్తు్న్నారేమో గమనించండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇటీవల యువతలో ఈ కొత్త ధోరణి విస్తరిస్తోంది. క్యారెక్టర్.ఏఐ, రెప్లికా వంటి ప్లాట్‌ఫామ్‌లు అనేకమందది టీనేజ్ బాయ్స్‌ను ఆకర్షిస్తున్నాయని, వీరు ఏఐ సహచరులతో పారాసోషల్ (వన్‌సైడ్) రొమాంటిక్ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఏఐ.. ఎమోషనల్

ప్రధానంగా 13 నుంచి17 ఏళ్లలోపు టీనేజ్ అబ్బాయిలు క్యారెక్టర్ ఏఐకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్యూ రీసెర్చ్ ప్రకారం కూడా.. వరల్డ్‌వైడ్‌గా టీనేజ్ బాయ్స్‌లో 64% మంది ఏఐ చాట్‌బాట్‌లు ఉపయోగిస్తున్నారు. ఇవి ఎప్పుడూ, ఏ విషయాన్నైనా యాక్సెప్ట్ చేస్తుండటం, రిజెక్ట్ చేసే పరిస్థితులు లేకపోవడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం, 24/7 అందుబాటులో ఉండే “పర్ఫెక్ట్” సహచరులుగా లేదా “పర్ఫెక్ట్” గర్ల్ ఫ్రెండ్‌గా అనిపించడం వల్ల ఆకర్షణ పెరుగుతోంది.

పెరుగుతున్న మోజు..

సామాజిక ఆందోళన(Social anxiety), ఒంటరితనం, రిజెక్షన్ భయం ఉన్న టీనేజర్స్ ఏఐ చాట్‌బాట్‌లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎమోషనల్ సపోర్ట్స్‌గా వ్యవహరిస్తున్నాయి. సురక్షితమైన, మృదువైన, ప్రేమతో కూడిన ఇంటరాక్షన్ అందిస్తున్నాయి. అందుకే టీనేజ్ అబ్బాయిల్లో క్యారెక్టర్ ఏఐ పట్ల మోజు పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఇక Gen Z(18-34)లో కూడా 28% పురుషులు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ యాప్‌లను ప్రయత్నించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి ఏఐ యువతను సరికొత్త ప్రపంచంలోకి ఆకర్షిస్తోంది.

లాభమా? నష్టమా?

*లాభాలు : కొన్ని అధ్యయనాలు (Harvard, Replika సంబంధిత) యువత ఏఐ సహచరులతో ఇంటరాక్ట్ అవ్వడంవల్ల ఒంటరితనం, ఆందోళన వంటివి తగ్గడం, భావోద్వేగ మద్దతు వంటి సానుకూల ప్రభావాలు ఉంటాయని పేర్కొంటున్నాయి. అంతేకాకుండా యూజర్లు నిజమైన సంబంధాల్లో మెరుగైన కమ్యూనికేషన్ నేర్చుకున్నట్లు వెల్లడించాయి.

*నష్టాలు: క్యారెక్టర్ ఏఐ పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఒంటరితనాన్ని కొంత వరకు తగ్గించినప్పటికీ దీర్ఘకాలిక నష్టాలను కలిగిస్తుందని మరికొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక నైపుణ్యాలు తగ్గుతాయని(deskilling), హై డిపెండెన్సీ పెరుగుతుందని, నిజమైన సంబంధాలపట్ల అవగాహన, ఆకర్షణ తగ్గుతుందని, సోషల్ విత్‌డ్రాయల్ పెరగుతుందని చెబుతున్నాయి. అంతేకాకుండా టీనేజ్ అబ్బాయిల మానసిక అభివృద్ధికి ఇది ప్రమాదకరమని కూడా నిపుణులు అంటున్నారు. మొత్తంగా నష్టాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు, థెరపిస్టులు భావిస్తున్నారు. క్యారెక్టర్ ఏఐ వాడకంపట్ల జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు.

Next Story