- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్‌లో ‘పెద్ది’
ఈ ఏడాది సౌత్ ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ‘పెద్ది’ నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూన్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. వారం రోజుల్లోనే ఈ చిత్రం 345 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా వసూళ్లకు సంబంధించిన మరో అప్డేట్‌ను విడుదల చేశారు.
ఈ ఏడాది సౌత్ ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ‘పెద్ది’ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో వారం రన్ కొనసాగుతోంది. పూర్తి బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






