తాడిపత్రిలో ఉద్రిక్తం.. 24 మంది కార్యకర్తల అరెస్ట్‌కు జేసీ డిమాండ్

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హెటైన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా రోడ్డెక్కారు..

తాడిపత్రిలో ఉద్రిక్తం..  24 మంది కార్యకర్తల అరెస్ట్‌కు జేసీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) తాడిపత్రి(Tadipatri)లో హెటైన్షన్(HighTention) వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Muncipal Chairman Jc Prabhakar Reddy) తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా రోడ్డెక్కారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ycp Former Mla Kethi Reddy Peddareddy)తో పాటు ఆ పార్టీకి చెందిన 24 మంది కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ప్రభాకర్ రెడ్డి అసహనం

అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. చట్టం అందరికీ ఒకేలా పని చేయాలని సూచించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారని గత ప్రభుత్వంలో అదే జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని లేని‌పక్షంలో నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తాడిపత్రి పట్టణంలో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మోహరించారు.

Next Story