- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హిట్ అండ్ రన్’ సినిమా నుంచి హీరోయిన్ పోస్టర్ విడుదల.. రిపోర్టర్‌గా హాట్ బ్యూటీ!
ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న నటాషా సింగ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె రిపోర్టర్ సాక్షి అనే ఒక పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంలో సినీ ప్రేక్షకులు విభిన్నమైన కంటెంట్‌తో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సరికొత్త స్క్రీన్‌ప్లేతో థ్రిల్ పంచే చిత్రాలకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లోనూ డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే టాలెంటెడ్ నటుడు సంజయ్ రావ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్ అండ్ రన్’. ఈ వైవిధ్యమైన చిత్రానికి సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మి నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, గతంలో విడుదలైన హీరో సంజయ్ రావ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న నటాషా సింగ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె రిపోర్టర్ సాక్షి అనే ఒక పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటాషా సింగ్ లుక్ చాలా సీరియస్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా లాంచ్ చేయించడం విశేషం. పోస్టర్‌ను విడుదల చేసిన రకుల్.. చిత్రబృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. స్టార్ హీరోయిన్ సపోర్ట్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.






