సెంట్ ఆన్స్ హై స్కూల్ అత్యుత్సాహం.. మూడు రోజుల ముందే పాఠశాల రీ ఓపెన్!?

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-12 07:33:55  IST  )

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సెంట్ ఆన్స్ హై స్కూల్ అత్యుత్సాహం.. మూడు రోజుల ముందే పాఠశాల రీ ఓపెన్!?
X

దిశ, సంగారెడ్డి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ముందు ఈ నెల 12 వరకు వేసవి సెలవులు ఉండగా మరో మూడు రోజులు పొడిగిస్తూ తాజాగా జీవో జారీ చేసింది. కానీ సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆన్స్ హై స్కూల్ పాఠశాల యాజమాన్యం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. మూడు రోజుల ముందే పాఠశాలను తిరిగి ప్రారంభించింది. ఈ మేరకు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను స్కూల్ కి పంపించాలంటూ మెసేజ్‌లు కూడా పంపింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాఠశాలను నడిపించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఇలాంటి పాఠశాల పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story