బ్యాంక్ అకౌంట్‌లో రూ.16.78 లక్షలు మాయం.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

by Jakkula.Mamatha |

ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ డబ్బులు తమ ప్రమేయం లేనిదే ఖాతా నుంచి మాయమయ్యాయని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంక్ అకౌంట్‌లో రూ.16.78 లక్షలు మాయం.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
X

దిశ, షాద్ నగర్: ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ డబ్బులు తమ ప్రమేయం లేనిదే ఖాతా నుంచి మాయమయ్యాయని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తూరు సీఐ నరసయ్య కథనం ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీ మినీ సిటీ కాలనీకి చెందిన అన్న మానస, సురేష్ బాబులు భవన నిర్మాణం కోసం వాస్తు హౌసింగ్ సంస్థ రూ.74 లక్షలను హౌసింగ్ లోన్ మంజూరు చేశారు. మొదటి విడతలో రూ. 33 లక్షలు, రెండో విడతలో మే 12న రూ.26 లక్షలు మానస యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తూరు శాఖ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. ఈ నెల 9న డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా మానస అకౌంట్లో రూ.748 మాత్రమే ఉన్నాయని బ్యాంకు సిబ్బంది తెలియజేయడంతో ఆందోళనకు గురైన మానస బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించింది.

మే 12 నుంచి జూన్ 9వ తేదీ వరకు గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్ నుంచి రూ. 1000 మొదలు రూ. 49 వేల వరకు పలు దఫాలుగా రూ. 14,68,009 రూపాయలను విత్ డ్రా చేసినట్లు గ్రహించింది. అలాగే తన కరెంటు ఖాతా నుంచి జూన్ 5, జూన్ 9 మధ్య రూ.2,10,000 నగదు తన ప్రమేయం లేకుండా బదిలీ అయినట్లు తెలుసుకొని ఆందోళనకు గురైంది. మొత్తం తన రెండు అకౌంట్‌లలో నుంచి రూ.16,78,009 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు విత్ డ్రా చేశారని గ్రహించి 1930 నెంబర్ కు ఫోన్ చేసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బాధితురాలు మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story