విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదం ఎఫెక్ట్.. ఉద్యోగుల అంత‌ర్గ‌త బ‌దిలీలు

by Ajay Maddhiboyina |

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తరవాత యాజమాన్యం అంతర్గత బదిలీలు చేపడుతోంది. మృతుడు గోల్డ్ కుమార్ బాడీ త‌ర‌లింపులో నిర్ల‌క్ష్యంపై యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదం ఎఫెక్ట్.. ఉద్యోగుల అంత‌ర్గ‌త బ‌దిలీలు
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తరవాత యాజమాన్యం అంతర్గత బదిలీలు చేపడుతోంది. మృతుడు గోల్డ్ కుమార్ బాడీ త‌ర‌లింపులో నిర్ల‌క్ష్యంపై యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏడుగురు అధికారుల‌ను బ‌దిలీ చేసింది. అంతే కాకుండా ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డంతో మ‌న‌స్థాపం చెందిన ఓ అధికారి త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాళ్ల‌ను వ‌దిలేసి అధికారులు, కార్మికుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఏంట‌ని కార్మిక సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. గోల్డ్ కుమార్ బాడీని ఎయిర్ లిఫ్ట్ చేయ‌లేద‌ని స‌స్పెండ్ చేస్తే అస‌లు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాళ్ల ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని మండిప‌డుతున్నారు. యంత్రాలు స‌రిగ్గా ప‌నిచేయ‌డంలేద‌ని కింది స్థాయి ఉద్యోగులు, హెచ్ ఓవీలు చాలా కాలం నుండి ఫిర్యాదులు చేస్తున్నార‌ని అయినా యాజ‌మాన్యం ప‌ట్టించుకోలేద‌న్నారు. యాజ‌మాన్యం ప‌ట్టించుకోక‌పోవ‌డంవ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. సంబంధం లేని అధికారులు, కార్మికుల‌పై కాకుండా అస‌లు దోషుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story