- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇలాంటివి కల్పించవద్దు.. చిన్మయి సెన్సేషనల్ పోస్ట్
సీరియస్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇలాంటి పెద్ద వేదికలు కల్పించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

దిశ, సినిమా: సింగర్ చిన్మయి వివాదాస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఎవరు ఎంత ట్రోలింగ్ చేసినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తనకు అనిపించింది చెప్తూ అందరినీ ఆలోచింపచేస్తుంటుంది. తాజాగా, చిన్మయి పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఆరుముగమ్‌ను వేదన్ కలవడంపై చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయింది. వేదన్, మంత్రి రాజ్‌మోహన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోను రీపోస్ట్ చేస్తూ.. హీరో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అయినా మునుపటి డీఎంకే ప్రభుత్వం కంటే భిన్నంగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సీరియస్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇలాంటి పెద్ద వేదికలు కల్పించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
గతంలో ఒక పాట కోసం తాను వేదన్‌తో కలిసి పనిచేయాల్సి ఉందని.. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల గురించి తెలియడంతో ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నానని చిన్మయి గుర్తుచేసుకున్నారు. సోషల్ యాక్టివిజం పేరుతో మహిళల సమ్మతిని కాలరాసే పురుషుల ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను కూడా వేదన్ కలిసిన వీడియోను చిన్మయి షేర్ చేస్తూ.. ఇలాంటి నిందితులకు మద్దతు ఇవ్వద్దని కోరి అలసిపోయానని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో బాధితులైన మహిళలకు ఎలాంటి మద్దతు లభించడం లేదని, కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులను మాత్రం హీరోలు, నాయకులుగా చూపిస్తూ పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇక చాలుఆపండి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వేదన్‌పై లైంగిక దాడి కేసులతో పాటు డ్రగ్స్, పులిగోరు కలిగి ఉన్నారనే వైల్డ్‌లైఫ్ కేసులు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన మంత్రి రాజ్‌మోహన్ ఆరుముగమ్‌ను కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.






