చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని వెంకట్రాయని చెరువులో గురువారం గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది.

చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
X

దిశ,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని వెంకట్రాయని చెరువులో గురువారం గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లిలోని బాబాయి తండాకు చెందిన వెంకట్రాయిని చెరువులో భూక్య ప్రశాంత్ అనే యువకుడు తన మిత్రుడు గుగులోత్ సంతోష్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం వీర్నపల్లి వెంకట రాయిని చెరువులో చేపలు పట్టబోయి చెరువులో గల్లంతయ్యాడు.

గల్లంతైన అతని కోసం పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి శుక్రవారం ఉదయం మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి నెలరోజుల క్రితమే వివాహమైంది. తల్లి గేలీబాయి, భార్య ఉన్నారు. వీర్నపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story