శంకర్ బాటలో మురుగదాస్.. ఇక్కడ మిస్ అయితే కెరీర్ మొత్తంగా క్లోజ్ అయినట్టేనా?

by Pulgam srinivas |   (  Updated:2026-06-12 06:37:12  IST  )

శంకర్, మురుగదాస్‌ 'లో' బడ్జెట్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

శంకర్ బాటలో మురుగదాస్.. ఇక్కడ మిస్ అయితే కెరీర్ మొత్తంగా క్లోజ్ అయినట్టేనా?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా విజయాలు ఎంతో కీలకం. విజయాలు ఉన్నప్పుడు అవకాశాలకు కొదవ ఉండదు. కానీ విజయాలు తగ్గితే అవకాశాలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పడతాయి. ఇందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు శంకర్, మురుగదాస్ ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం వరకు వరుస విజయాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగడమే కాకుండా, ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శంకర్ విషయానికి వస్తే, ‘రోబో’ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు కూడా భారీ పరాజయాలను చవిచూశాయి. దీంతో ఆయన కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.

మురుగదాస్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఒకప్పుడు తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకు ‘దర్బార్’, ‘సికిందర్’, ‘మదరాసి’ వంటి సినిమాలు వరుసగా నిరాశనే మిగిల్చాయి. దీంతో ఆయన రేంజ్ కూడా చాలా వరకు తగ్గింది. ఇక భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న శంకర్ ప్రస్తుతం ఒక చిన్న బడ్జెట్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ భారీ ప్రాజెక్ట్‌లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మురుగదాస్ కూడా ముందుగా 'లో' బడ్జెట్ సినిమాతో విజయాన్ని అందుకుని, తర్వాత తనదైన శైలిలో భారీ చిత్రాలకు తిరిగి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరికీ తక్కువ బడ్జెట్ సినిమాలతో హిట్ దక్కితే మళ్లీ క్రేజ్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరో పరాజయం ఎదురైతే కోలుకోవడం కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రెండు ఫ్లాపులతో షాహిద్ కపూర్ కీలక నిర్ణయం.. నా జడ్జ్‌మెంట్ తప్పుకావచ్చంటూ షాకింగ్ కామెంట్స్

Next Story