రెండు ఫ్లాపులతో షాహిద్ కపూర్ కీలక నిర్ణయం.. నా జడ్జ్‌మెంట్ తప్పుకావచ్చంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

వరుస ప్లాపుల వల్ల తాను కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు సంచలన విషయాలను పంచుకున్నారు.

రెండు ఫ్లాపులతో షాహిద్ కపూర్ కీలక నిర్ణయం.. నా జడ్జ్‌మెంట్ తప్పుకావచ్చంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించినంత స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన కృతి సనన్, రష్మిక మందన్నలతో కలిసి నటించిన ‘కాక్‌టెయిల్ 2’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, షాహిద్ కపూర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. వరుస ప్లాపుల వల్ల తాను కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు సంచలన విషయాలను పంచుకున్నారు. వరుస ప్లాపులపై షాహిద్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఎంతకాలం పనిచేశామనే దానికి, సక్సెస్‌కు సంబంధం ఉండదని, సినిమాలు ఎప్పుడూ మనం అంచనా వేయలేనంత విచిత్రంగా ఉంటాయని అన్నారు. ఒక నటుడిగా మూవీ రిజల్ట్‌పై మనకు పూర్తి కంట్రోల్ ఉండదని, అంతిమంగా డైరెక్టర్ ఏది ఓకే చేస్తే అదే స్క్రీన్‌పై కనిపిస్తుందని చెప్పారు.

వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని ఆయన అంగీకరించారు. ఈ ప్లాపుల తర్వాత తన లైఫ్‌లో ఒక పెద్ద మార్పు చేసుకున్నట్లు షాహిద్ తెలిపారు. ఇకపై తాను ఒంటరిగా కథల నరేషన్ వినకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే కెమెరా ముందు ఏం చేయాలో తనకు బాగా తెలుసేమో కానీ, ఎలాంటి కథలను ఎంచుకోవాలో బహుశా తనకు తెలియడం లేదని వారితో అన్నట్లు పేర్కొన్నారు. తన నటన పరమైన ఆలోచనలు ఒక్కోసారి కరెక్ట్ కాకపోవచ్చని, అందుకే ఇకపై కథలు వినేటప్పుడు రూమ్‌లో తనతో పాటు మరో ముగ్గురు టీమ్ సభ్యులు ఉండేలా చూసుకుంటున్నానని చెప్పారు. దీనివల్ల కథను అందరి కోణంలో అర్థం చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ ప్లాపుల తర్వాత షాహిద్ కపూర్ ఆశలన్నీ ఇప్పుడు ‘కాక్‌టెయిల్ 2’ సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ మూవీతోనైనా షాహిద్ కపూర్‌కు అదృష్టం కలిసొస్తుందా? లేదో చూడాలి.

Next Story