- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ షాకిచ్చిన అదా శర్మ.. ఊహించని లుక్‌లో కనిపించడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!
అందులో ఆమె లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సరికొత్త ఫోటో షూట్‌లో అదా శర్మ ఒంటినిండా రకరకాల టాటూలతో దర్శనమిచ్చింది.

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ చుట్టూ అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ తర్వాత కూడా వివాదాస్పద మూవీ ‘బస్తద్: ది నక్సల్ స్టోరీ’తో ప్రేక్షకులను అలరించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ‘గవర్నర్’ మూవీతో వచ్చిన అదా శర్మ ప్రస్తుతం హాటక్, ది గేమ్ ఆఫ్ గిర్గిట్ చిత్రాలు చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులతో పలు విషయాలను పంచుకుంటోంది. అలాగే తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. అందులో ఆమె లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సరికొత్త ఫోటో షూట్‌లో అదా శర్మ ఒంటినిండా రకరకాల టాటూలతో దర్శనమిచ్చింది.
ఒంటిపై ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్న ఆ టాటూల లుక్‌లో, ఒక పిల్లిని గట్టిగా పట్టుకుని, మత్తెక్కించే కళ్లతో ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నాయి. మునుపెన్నడూ చూడని ఈ విచిత్రమైన, బోల్డ్ లుక్‌లో అదా శర్మ కనిపించడంతో ఈ ఫోటోలు కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అదా శర్మ టాటూస్ లుక్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆమె స్టైల్ సూపర్ అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం అసలు ఈ టాటూలు నిజమైనవేనా? లేక ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినవా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఒకవేళ ఇవి నిజమైన టాటూలే అయితే.. ఇవి పర్మినెంట్ టాటూలా లేక సినిమా కోసం వేసుకున్న తాత్కాలిక టాటూలా? అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అదా శర్మ షేర్ చేసిన ఈ క్రేజీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






