- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరురోజులైనా దొరకని జాను ఆచూకీ.. అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు
కాకినాడ జిల్లా తునిలో ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాను ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. తుని మండలంలోని దొండవాక పంచాయితీ సీహెచ్ అగ్రహారం సమీపంలో యాభై ఎకరాల పామాయిల్ తోట కాపలాదారులుగా ఉంటున్న గణేష్, భవాని దంపతుల కుమార్తె ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయింది.

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తునిలో ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాను ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. తుని మండలంలోని దొండవాక పంచాయితీ సీహెచ్ అగ్రహారం సమీపంలో యాభై ఎకరాల పామాయిల్ తోట కాపలాదారులుగా ఉంటున్న గణేష్, భవాని దంపతుల కుమార్తె ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. చిన్నారి తన కుక్క వెంట వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించగా అదే రోజు తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి నుండి దాదాపు 200 మంది పోలీసులు చిన్నారి జాడ కోసం వెతుకున్నారు. చుట్టూ అటవీప్రాంతం, కొండలు గుట్టలు ఉండటంతో ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే శనివారం చిన్నారి కుక్కతో కలిసి అడవివైపు వెళ్లగా మంగళవారం కుక్క ఇంటికి తిగిరి వచ్చింది కానీ చిన్నారి మాత్రం రాలేదు. ఈ కేసులో కుక్క కీలకంగా మారడంతో పోలీసులు దానిని అడవిలో విడిచిపెట్టి అనుసరిస్తూ వెళ్లారు. కానీ ఆచూకీ మాత్రం లభించలేదు. ఇప్పుడు దానికి ట్రాకర్ అమర్చి మరోసారి గాలింపు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వెళ్లి వచ్చినప్పటి నుండి కుక్క ఆందోళనకరంగా కనిపిస్తూ ఉండటం, మనుషులను చూస్తే భయపడం చూసి బోనులో బంధించారు. ఇప్పుడు దానికి ట్రాకర్ అమర్చి, స్నైపర్ డాక్స్ ను దాని వెంట విడిచిపెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బిడ్డ ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తల్లి తమ పెంపుడు కుక్కతో జాను ఎక్కడ ఉంది.. తీసుకువస్తావా అంటూ మాట్లాడే సన్నివేశాలు గుండెను పిండేసేలా కనిపిస్తున్నాయి.






