మహబూబాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో నెట్‌వర్క్ విస్తరణ.. కలెక్టర్ స్నేహ శబరిష్ యాక్షన్ ప్లాన్!

by Jakkula.Mamatha |

ఒక ఫోన్ కాల్ చేయాలన్నా.. ఒక మెసేజ్ పంపాలన్నా ఇంటర్నెట్ ఉపయోగించాలన్నా కొండలు, గుట్టలు ఎక్కవలసిన పరిస్థితి ఏజెన్సీలోని గ్రామాలు ఎదుర్కొనేవి.

మహబూబాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో నెట్‌వర్క్ విస్తరణ.. కలెక్టర్ స్నేహ శబరిష్ యాక్షన్ ప్లాన్!
X

దిశ, కొత్తగూడ: ఒక ఫోన్ కాల్ చేయాలన్నా.. ఒక మెసేజ్ పంపాలన్నా ఇంటర్నెట్ ఉపయోగించాలన్నా కొండలు, గుట్టలు ఎక్కవలసిన పరిస్థితి ఏజెన్సీలోని గ్రామాలు ఎదుర్కొనేవి. అత్యవసర సమయంలో అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వలేక, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు దూరమై, యువత ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని కోల్పోతున్న పరిస్థితులు గతంలో కోకొల్లలు ఉన్నాయి. అలాంటి గిరిజన ప్రాంతాల కష్టాలను గుర్తించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, కొత్తగూడ, గంగారం మండలాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారించారు. టెలికాం సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, నెట్‌వర్క్ అందని గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఏజెన్సీలో పుట్టడం ప్రజల తప్పు కాదు. అభివృద్ధి వారికి కూడా సమాన హక్కు అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న కలెక్టర్ మారుమూల గ్రామాలల్లో నివసించే ప్రతి కుటుంబం కూడా ప్రపంచంతో అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. నేటి కాలంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు విలాసం కాదు.. అవసరం. పిల్లల చదువు నుంచి రైతుల వ్యవసాయం వరకు, వైద్యం నుంచి ప్రభుత్వ సేవల వరకు ప్రతిదీ డిజిటల్ మాధ్యమాల పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలు కూడా సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసలు అందుకుంటుంది. ఏళ్లుగా "ఇక్కడ సిగ్నల్ రాదు" అనే మాట వినిపించిన గ్రామాల్లో ఇకపై "ఇక్కడ కూడా ప్రపంచం చేతిలోకి వచ్చింది" అనే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Next Story