ధ‌నుష్ కొత్త సినిమాలో శ్రీ లీల ఒక్క‌రే కాదు, మరో హీరోయిన్ కూడా

by velandi.Saikiran |   (  Updated:2026-02-02 15:58:48  IST  )

త‌మిళ‌ హీరో ధనుష్, శ్రీ లీల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

ధ‌నుష్ కొత్త సినిమాలో శ్రీ లీల ఒక్క‌రే కాదు, మరో హీరోయిన్ కూడా
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తమిళ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా గుర్తింపు ఉన్న ధనుష్, వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మంచి కాన్సెప్ట్ తో ఎప్పుడు ప్రేక్షకులను అలరించే హీరో ధనుష్, ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియా సామి ( Amaran Director Rajkumar) దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. D 55 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమరన్ లాంటి సినిమాతో సక్సెస్ అందుకున్న రాజ్ కుమార్, ధనుష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. అటు మమ్ముట్టి స్పెషల్ రోల్ చేయబోతున్నారట.

ధనుష్ సినిమాలో సాయి పల్లవి

త‌మిళ‌ హీరో ధనుష్, శ్రీ లీల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. సాయి పల్లవిని ( Sai pallavi ) కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లతో హీరో ధనుష్ స్టెప్పులు వేయనున్నాడు. అయితే ఇందులో సాయి పల్లవి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఆమెను చూస్తారట. అందుకే సాయి పల్లవిని ఆ పాత్ర కోసం మాత్రమే దర్శకుడు రాజ్ కుమార్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఉంటుందా ? లేక శ్రీ లీల ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు సాయి అభ్యంకర్ ( Sai Abhyankkar ) సంగీత స్వరాలు అందిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండ‌గా, ఉండ‌ర్ బార్ ఫిల్మ్స్‌, ఆర్ టేక్ స్టూడియోస్ ఆధ్వ‌ర్యంలో వ‌స్తోంది.

Read more... Couple Friendly Trailer: ఒకే రూంలో ల‌వ‌ర్స్‌..ముద్దులు, హగ్గులు..ఇర‌గ‌దీసిన సంతోష్ శోభ‌న్‌

Next Story