- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Couple Friendly Trailer: ఒకే రూంలో లవర్స్..ముద్దులు, హగ్గులు..ఇరగదీసిన సంతోష్ శోభన్
హీరో సంతోష్ శోభన్ ( Santosh Soban ), మానస వారణాసి ( Manasa Varanasi) జంటగా నటించిన సినిమానే కపుల్ ఫ్రెండ్లీ.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే, మరి కొంత మంది అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. అయితే మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే యంగ్ హీరోలు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ( Santosh Soban ) ఒకరు. పేపర్ బాయ్ లాంటి సినిమాలతో పాపులరైన సంతోష్ శోభన్, తాజాగా కొత్త సినిమాతో రాబోతున్నారు. కపుల్ ఫ్రెండ్లీ ( Couple Friendly ) అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తోన్న సంతోష్ శోభన్, లవర్స్ డే రోజు హిట్ కొట్టేలాగా కనిపిస్తున్నాడు.
కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ వచ్చేసింది
హీరో సంతోష్ శోభన్ ( Santosh Soban ), మానస వారణాసి ( Manasa Varanasi) జంటగా నటించిన సినిమానే కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ ( Ashwin Chandrasekar ) దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో, తాజాగా ట్రైలర్ ( Couple Friendly Trailer ) రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో హగ్గులు, ముద్దు సీన్లు అబ్బో ఇంకా ఎన్నో ఉన్నాయి. హీరో శోభన్, ఓ అమ్మాయికి ఎలా దగ్గరవుతాడు ? ఆమెతో పరిచయం పెంచుకొని రూమ్ కు ఎలా తీసుకువెళ్తాడు? ఆ తర్వాత వారిద్దరి మధ్య చిగురించే ప్రేమ కథనే ఈ ఫ్రెండ్లీ కపుల్. సింపుల్ గా చెప్పాలంటే సహజీవనం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాయి అనే విషయాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. లవర్స్ డే రోజు మంచి ట్రీట్ రాబోతుందని అంటున్నారు. మరి సంతోష్ శోభన్ , మానస వారణాసి నటించిన ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.






