- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో ఈ నెల 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నయ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీజే ప్లే చేసిన ఓ పాట వివాదాస్పదమైంది. మ్యాచ్ జరుగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ గాన అప్పు పాడిన ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’పాటను డీజే ప్లే చేశాడు. ఆ పాటలోనే ఈ పదాలపై సీఎస్కే అభ్యంతరం తెలిపింది. ఇది తమిళనాడు గుర్తింపును అపహాస్యం చేయడమేనని సీఎస్కే భావిస్తుంది. ఈ క్రమంలోనే బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేసింది. ‘డీజేలు హోం టీమ్‌కు మద్దతుగా ఉంటాయి. కానీ, చిన్నస్వామి స్టేడియంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మా ప్లేయర్లపై కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. దీని గురించే మేము బీసీసీఐకి లేఖ రాశాం.’అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు అందిందని, రివ్యూ చేస్తున్నట్టు తెలిపింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గత సీజన్‌లో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కూడా ఈ పాటపై వివాదం నెలకొంది. చెన్నయ్‌లో సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ పాట పాడగా.. చెన్నయ్ ఫ్యాన్స్‌కు అది నచ్చలేదు. రిటర్న్ గేములో జితేశ్ అవుటైనప్పుడు సీఎస్కే డీజే అదే పాటను ప్లే చేశాడు.






