- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలంకలో బంగ్లా మ్యాచ్ లు ? బీసీసీఐ సంచలన ప్రకటన !
శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించాలని బంగ్లా కోరడం అత్యంత దారణమంటూ ఫైర్ అయింది బీసీసీఐ. అలా ఇష్టానుసారంగా వేదికలు మార్చడానికి కుదరదని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: ముస్తాఫిజుర్ రహమాన్ అంశం నేపథ్యంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియాలో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ ల వేదికలు మార్చాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఐసిసికి ఫిర్యాదు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైందట. ఈ విషయం బయటకు రావడంతో తాజాగా బీసీసీఐ స్పందించింది.
ఎప్పుడు పడితే అప్పుడు వేదికలు మార్చడం, ఎక్కడ పడితే అక్కడ ఆడతామంటే అస్సలు కుదరదు అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు బీసీసీఐ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాతో ఆడే ఇతర జట్ల గురించి కూడా కాస్త ఆలోచించాలి.. వాళ్లకు సంబంధించిన టికెట్లు, హోటల్స్ కూడా బుక్ అయ్యాయి అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించాలని బంగ్లా కోరడం అత్యంత దారణమంటూ ఫైర్ అయింది బీసీసీఐ. అలా ఇష్టానుసారంగా వేదికలు మార్చడానికి కుదరదని తెలిపింది. మరి దీనిపై ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
READ MORE ....






