ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్

by Dishanational4 |
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకా మైదానంలో జరిగిన భారత్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ప్రారంభంలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలగా.. శ్రేయాస్ అయ్యర్‌, ఆశ్విన్‌లు గట్టెక్కించారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 62 బంతుల్లో 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. దాంతో టెస్టు మ్యాచ్‌ రన్ ఛేజింగ్‌లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక, ఇదివరకు ఈ జాబితాలో 1908లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ప్లేయర్ సిడ్నీబర్న్స్ 38 పరుగులతో ఈ రికార్డు తన పేరిట ఉండేది. తాజాగా అశ్విన్ ఆ రికార్డు బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Also Read...

2022 లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?



Next Story

Most Viewed