నీళ్లు నిలబడి తాగాలా.. కూర్చొని తాగాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది...

by Disha Web Desk 20 |
నీళ్లు నిలబడి తాగాలా.. కూర్చొని తాగాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది...
X

దిశ, ఫీచర్స్ : నీళ్లు తాగే పద్దతుల గురించి ఎన్నో అపోహలు వస్తుంటాయి. ముఖ్యంగా మన ఇంట్లో పెద్దలు నీళ్లు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నీళ్లు తాగే పద్దతుల్లో నిలబడి నీళ్లు తాగడం కూడా ఒకటి. ఈ పద్దతి పై పెద్దలు ఎప్పుడూ చిన్నవారికి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. నిలబడి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని వారు చెబుతుంటారు. నీరు లేదా ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదని, కూర్చొని తాగాలని తరచుగా చెబుతారు. నిలబడి నీళ్లు తాగితే జీర్ణక్రియ చెడిపోయి ఆహారం జీర్ణం కావడం కష్టమని, దీంతో మలబద్ధకం ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. అందుకే నిలబడి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. నిలబడి నీళ్ళు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటుంటారు. నిలుచుని నీళ్లు తాగితే దాహం తీరదని, పదే పదే దాహం వేస్తోందని ఇంటి పెద్దలు చెబుతుంటారు.

ICMR ఏం చెబుతోంది ?

మన దేశంలోని అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, త్రాగునీటికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. నిలబడి నీరు త్రాగడం వల్ల కాళ్ళకు, శరీరానికి ఎటువంటి హాని కలుగుతుందో రుజువు లేదని చెబుతుంది. దీన్ని నిర్ధారించే ఖచ్చితమైన ఆధారాలు కనిపించలేదని చెబుతుంది. అందుకే మీరు నిలబడి లేదా కూర్చొని నీరు త్రాగినా మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

నిపుణులు ఏమంటారు..

కొంతమంది నిపుణులు మాట్లాడుతూ నిలబడి నీరు తాగడం వల్ల హాని కలుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు లేవని చెప్పారు. ఇప్పుడు ICMR కూడా నీటిని ఏ విధంగానైనా తాగవచ్చని ధృవీకరించింది. నిలబడి నీళ్లు తాగకూడదన్న మాట పాత అపోహ. ఈ సమస్యలన్నీ నిలబడి తాగడం వల్ల వస్తాయని, అలాగే నిలబడి తాగే నీళ్లతో ఈ వ్యాధులకు ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతున్నారు.

ఎంత నీరు త్రాగాలి..

ప్రతిరోజూ శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని, ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు నిపుణులు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed