దూరం పెట్టిందన్న కోపంతో వివాహిత హత్య

by Disha Web Desk 11 |
దూరం పెట్టిందన్న కోపంతో వివాహిత హత్య
X

దిశ, భిక్కనూరు : పెట్టుకున్న అక్రమ సంబంధం వలన కుటుంబంలో గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో... దూరం పెట్టినందుకు గాను... వివాహితకు ఫుల్లుగా మద్యం తాగించి.. ఆమెపై అత్యాచారం చేసి కోరిక తీర్చుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిక్షణ పొందిన ఐపీఎస్ అధికారిని కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. మండలంలోని జంగంపల్లి లక్ష్మీ నగర్ తండాకు చెందిన సంధ్యకు , దోమకొండ మండలం చింతమాన్ పల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ కు ఉన్న పరిచయంతో అక్రమ సంబంధానికి దారితీసింది.

దీంతో తన సంసారానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న ఉద్దేశంతో గ్యాప్ పెట్టింది. దీనిని మనుసులో పెట్టుకుని 14.9.22న కామారెడ్డిలో అడ్డ కూలీ పనికి వెళ్లిన సంధ్యను ఫోన్ లో తన మాయమాటలతో నమ్మించి, పాత రాజంపేట గేటు వద్దకు రమ్మన్నాడు. అక్కడ నాలుగు బీర్లు తీసుకొని క్యాసంపల్లి సమీపంలోని వైకుంఠధామం వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి బీర్లు తాగారు. మద్యం మత్తులో కింద పడిపోయిన ఆమెపై అత్యాచారం చేసి, కోరిక తీర్చుకున్నాడు.

ఆ తర్వాత పక్కనే ఉన్న పెద్ద బండరాయి తో తలపై కొట్టి చంపాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలతో పాటు, 50 వేల నగదు సెల్ ఫోను ను బంగారు వస్తువులను తీసుకొని వెళ్లి ఇంట్లో దాచి పెట్టి, కొద్ది రోజులకు మహేష్ గల్ఫ్ దేశానికి ఉ డాయించాడు. దీంతో ఆమె భర్త గోపి భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటినుండి కేసు ట్రేస్ అవుట్ కాకపోవడంతో జిల్లాలోని ట్రేస్ అవుట్ కాని కేసులను జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు స్పెషల్ కేసుల కింద తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య కేసులో పోలీసులకు కొన్ని సాక్ష్యాలు లభించడంతో, దాని ఆధారంగా కేసును లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది.

ఈ మేరకు మహేష్ ను గల్ఫ్ దేశం నుంచి రప్పించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా సంధ్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సంధ్య పుర్రె, ఎముకలను, టిఫిన్ బాక్స్, ప్లాస్టిక్ తట్టను స్వాధీనం చేసుకొని మృతురాలి భర్తకు చూపించగా, అవి సంధ్యవేనని పేర్కొన్నాడు. ఈ మేరకు మహేష్ ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని వారు వివరించారు. కాగా కేసును దర్యాప్తు చేసి చాకచక్యంగా నిందితున్ని పట్టుకున్న భిక్కనూరు సిఐ సంపత్, ఎస్సై సాయికుమార్ తో పాటు సిబ్బంది గడ్డం నరేష్, సంతోష్, వెంకట్ రాములు, స్వామి, రేణుక, రాకేష్, సదాశివ నగర్ కానిస్టేబుల్ రవి లను ఆమె అభినందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed