- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోన్న చికిత్స
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇవాళ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులతో ఆమె ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగారామ్ ఆసుపత్రి (Sir Gangaram Hospital)లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో గత కొద్దిరోజులుగా వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ భారీ కాలుష్యం కారణంగానే సోనియా గాంధీ అనారోగ్యానికి గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గతంలోనూ ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడటంతో ప్రస్తుత గాలి నాణ్యత ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో చేరిన ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఒక సీనియర్ పల్మోనాలజిస్ట్ (Pulmonologist) నేతృత్వంలోని వైద్య బృందం సోనియా గాంధీకి చికిత్సను అందజేస్తున్నారు. ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ గంగారామ్ ఆసుపత్రి వర్గాలు బులిటిన్ విడుదల చేశాయి.
Read More..
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ కన్నుమూత






