వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా లీక్ కు ఆధారాల్లేవు.. అమెరికా నిఘా వర్గాల వెల్లడి

by Dishafeatures2 |
వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా లీక్ కు ఆధారాల్లేవు.. అమెరికా నిఘా వర్గాల వెల్లడి
X

వాషింగ్టన్ : "కరోనా పుట్టినిల్లు చైనాలోని వూహాన్ ల్యాబ్" అని వాదిస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు మాట మార్చింది. కరోనా వైరస్ మూలాలు వుహాన్‌ ల్యాబ్‌లో ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈవివరాలతో నాలుగు పేజీల రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. వూహాన్ ల్యాబ్ లో వైరస్ పుట్టుకపై తగిన ఆధారాలు సేకరించలేకపోయామని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తేల్చి చెప్పింది. ఆ ల్యాబ్‌ నుంచి వైరస్ వచ్చిందన్నది ఊహే అయి ఉండొచ్చని తెలిపింది. వూహాన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో అన్ని విధాలుగా విచారణ జరిపినా ఎవిడెన్స్ లభించలేదని వివరించింది. అక్కడి సిబ్బందే వైరస్ తయారు చేసి లీక్ చేశారనడానికి రుజువులు లేవని వెల్లడించింది.



Next Story

Most Viewed