ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పనా సొరేన్ నామినేషన్: గాండే అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి

by Dishanational2 |
ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పనా సొరేన్ నామినేషన్: గాండే అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్ భార్య కల్పనా సొరేన్ రాష్ట్రంలోని గాండే అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా( జేఎంఎం) అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం చంపాయ్ సోరెన్, మంత్రి బాదల్ పత్రలేఖ్, మిథిలేష్ ఠాకూర్, అలంగీర్ ఆలంలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మే 20న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ తరఫున దిలీప్ వర్మ బరిలో ఉన్నారు. నామినేషన్ కు ముందు కల్పన జేఎంఎం అధినేత శిబూ సొరేన్‌తో భేటీ అయ్యారు. కాగా, గాండేలో జేఎంఎం ఎమ్మెల్యేగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ గతేడాది డిసెంబర్ 31న తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచే కల్పన అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ హేమంత్ వాటిని తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో కల్పనా పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story

Most Viewed