క్రేజీ జాబ్ ఎలుకలు పడితే రూ.1.2కోట్ల జీతం.. ఆ కండిషన్స్ మాత్రం పక్కా!

by Dishafeatures1 |
క్రేజీ జాబ్ ఎలుకలు పడితే రూ.1.2కోట్ల జీతం.. ఆ కండిషన్స్ మాత్రం పక్కా!
X

దిశ,ఫీచర్స్: ప్రతి ఇంట్లో ఎలుకల బెడద ఉంటుంది. ఎందుకంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి తిరుగుతూనే ఉంటాయి. ఇంట్లోని అన్నం, బట్టలను పాటు చేస్తాయి. అయితే, కొన్నిసార్లు ఎలుకల మందు ‘ర్యాట్ రెపల్లెంట్’ వాడినా ప్రయోజనం ఉండదు.

ఇకపోతే ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుక బాధతో ఓ 'ర్యాట్‌ క్యాచర్‌' ను నియమించారు. ఎలుకల నియంత్రణ కోసం “డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ కంట్రోల్” ఉద్యోగం కోసం అభ్యర్థులను ఆహ్వానించారు. ఇందుకుగాను ఎలుకలు పట్టే వారికి జీతం అక్షరాలా 1.2 మిలియన్ డాలర్లు. అంటే 1.2 కోట్లు కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు 900 మంది దరఖాస్తు చేసుకోగా.. ‘కాథ్లీన్ కొరాడి’ ఎంపికైంది. ఆమె స్కూల్‌ లో టీచర్‌ గా పనిచేస్తూనే, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఎలుకల నియంత్రణపై పరిశోధనలు నిర్వహించి వాటికి ఆహారం, నీరు అందుబాటులో లేకుండా చేసింది.

ఈ టాస్క్‌లో భాగంగా, ఆమె ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం, చెత్తను ఎలుకలు కనుగొనకుండా చేయడం, వీటితోపాటు భూగర్భ రైళ్లలో ఎలుకలు నివాసాలను ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఎలుకల నిర్మూలనలో కొన్ని ఖచ్చితమైన పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎలుకలను విషంతో చంపకూడదు ఎందుకంటే విషపూరితమైన ఆహారాన్ని తిని ఎలుకలు చనిపోతే ఏ జీవికైనా ప్రాణాపాయం ఉంటుంది. అందువల్ల, ఎలుకల విషాన్ని వాడకుండా రూల్స్ పెట్టారు.

Next Story