అపార్ట్‌మెంట్‌ బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న పాప.. రక్షించిన అపార్ట్‌మెంట్ వాసులు(వీడియో)

by Disha Web Desk 9 |
అపార్ట్‌మెంట్‌ బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న పాప.. రక్షించిన అపార్ట్‌మెంట్ వాసులు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అపార్ట్‌మెంట్‌లో నాలుగో ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్ బాల్కనీ రూఫ్ టాప్‌పై ఎనిమిది నెలల చిన్నారి జారి పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు చిన్నారిని సురక్షితంగా రక్షించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాప ఎటువంటి గాయం కాకుండా బయటపడింది. దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న చిన్నారిని కాపాడే వీడియోను ఎదురింట్లో వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వీక్షించిన జనాలు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం సరికాదని, పైగా ఎనిమిది నెలల చిన్నారిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story

Most Viewed