- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ మీరు వందేళ్లు బతకాలి.. పక్కన డాక్టర్లను పెట్టుకో: బండి సంజయ్
జూన్ 4న రాబోయే ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెంపపెట్టు తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో:జూన్ 4న రాబోయే ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెంపపెట్టు తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తుల కుటిల పన్నాగాలకు హిందువులంతా ఐక్యత చూపించారన్నారన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసిన బండి సంజయ్.. ముస్లింలంతా ఏకమై బండి సంజయ్ ని ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తే హిందువులంతా ఏకమై బండి సంజయ్ ని గెలిపించబోతున్నారని, హిందువులు ఏకమైతే ఎలాంటి ఫలితాలు వస్తాయో జూన్ 4వ తేదీన కరీంనగర్ పార్లమెట్ నియోజకవర్గం పరిధిలో చూపించబోతున్నారన్నారు. ఆ షాక్ ను చూసి కేసీఆర్ తట్టుకునేందుకు పక్కన సిద్దంగా డాక్టర్లను పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ వందేళ్లు బతకాలని కోరుకునే వ్యక్తులం తామని.. ఇకనైనా ఓ వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను రాచిరంపాన పెట్టవద్దన్నారు. తన గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు పని చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పడాలనే సంకల్పంతో అలుపెరుగని కృషి చేసిన బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.






