LPG Gas Price(July 23): తెలుగు రాష్ట్రాల్లో.. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

LPG Gas Price(July 23): తెలుగు రాష్ట్రాల్లో.. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల(జులై) ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వ్యాపారులకు ఊరటనిస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3,191గా ఉంది. ఇక, గృహ వినియోగ ఎల్‌పిజి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. నేడు(గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జులై 23వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో రూ.994.00, వరంగల్‌లో రూ.1013.00గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.950.00, విజయవాడ రూ.966.50, గుంటూరులో రూ.966.50గా ఉన్నాయి.

Next Story