- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
శ్రీవారి మహిమాన్విత తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఏడుకొండలవాడి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల క్యూలైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం ప్రాంతం వరకు కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 77,874 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా 35,302 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.92 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, పాలు, అన్నప్రసాద వితరణను టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. టోకెన్లు లేకుండా వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని గమనించి తిరుమల ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.






