కళ్యాణ్ రామ్‌తో పరశురామ్.. నిర్మాత ఎవరో తెలుసా?

by Pulgam srinivas |

కళ్యాణ్ రామ్, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు, దానిని దిల్ రాజు నిర్మించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కళ్యాణ్ రామ్‌తో పరశురామ్.. నిర్మాత ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించగా, అది నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కారు వారి పాట' మంచి విజయాన్ని అందుకోగా, అనంతరం తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ స్టార్' మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న పరశురామ్.. తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తెరకెక్కించనున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

Next Story