- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ ఎరువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.. మండల వ్యవసాయ అధికారి సూచన
నకిలీ ఎరువుల కొనుగోలు వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని బుధవారం తెలిపారు.

దిశ,వంగూరు: నకిలీ ఎరువుల కొనుగోలు వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని బుధవారం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నేపథ్యంలో రైతులు నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులనే వినియోగించాలని సూచించారు. రైతులు ఎల్లప్పుడూ లైసెన్స్ కలిగిన ఎరువుల విక్రయ కేంద్రాల నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలని తెలిపారు. మరియు ఎరువుల బస్తాలపై కంపెనీ పేరు, లాట్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, గరిష్ట చిల్లర ధర వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
అదేవిధంగా సీల్ తెగిపోయిన, లేబుల్ సరిగా లేని, లేదా అనుమానాస్పదంగా కనిపించే ఎరువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. నకిలీ ఎరువుల పై ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని కోరారు. రైతులు నాణ్యమైన ఎరువులను ఉపయోగించడం ద్వారా పంటల నాణ్యత, దిగుబడి పెరిగి మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండి నకిలీ ఎరువుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






