- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట కలెక్టరేట్‌లో కనీస సౌకర్యాల కరువు.. వాష్‌రూమ్‌లలో పనిచేయని నల్లాలు!
ప్రజా సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే కనీస వసతులు లేక ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, సూర్యాపేట ప్రతినిధి: ప్రజా సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే కనీస వసతులు లేక ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్‌లోని వాష్‌రూమ్‌లలో నల్లాలు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల మరమ్మతుల పేరుతో వాష్ బేసిన్‌కు నల్లాలను తొలగించిన అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి అమర్చకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, అక్కడ విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు వాష్‌రూమ్‌లను ఉపయోగించలేక అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు వాష్‌రూమ్‌లలో పరిశుభ్రత కూడా సరిగా పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరిచే చర్యలు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిపాలనకు కేంద్రబిందువైన కలెక్టరేట్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నల్లాలను తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు వాష్‌రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






