- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొరియన్ కనగరాజు ఆశలు గట్టిగానే ఉన్నాయి.. కానీ నిర్మాతల కోరికలు తీరేనా?
'కొరియన్ కనగరాజు' చిత్రానికి ఓటీటీ, థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ స్థాయిలో బిజినెస్ చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సినిమా విడుదలకు ముందే నిర్మాతలు తమ పెట్టుబడిని సురక్షితంగా మార్చుకునేందుకు ప్రచార కార్యక్రమాలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, వ్యాపార ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అదే వ్యూహంలో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనగరాజు' చిత్రానికి కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితిక నాయక్ కథానాయికగా నటించగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం వ్యాపార ఒప్పందాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ఓటీటీ హక్కుల ద్వారా రూ.15 కోట్ల వరకు, ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.5–6 కోట్లు, సీడెడ్ నుంచి సుమారు రూ.1.5 కోట్లు, నైజాం నుంచి రూ.4 కోట్ల వరకు రాబట్టాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.






