ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా డీజీపీ గారు?.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ (వీడియో)

by Ramesh Goud |
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా డీజీపీ గారు?.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ గూండాల దాడిలో స్థానిక పోలీసుల ప్రేక్షక పాత్ర చూడండి డీజీపీ గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కొందరు దుండగులు కర్రలతో దాడి చేసిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన ఆ సమయంలో పోలీసుల ప్రవర్తనపై పలు విమర్శలు చేశారు.

నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి డీజీపీ గారు అంటూ.. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు! అని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ప్రశ్నించారు. ఇప్పుడే డీఎస్‌పీ గారితో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్‌కు తీసుకరాలేకపోయారు! వాళ్ల మీద చర్య తీసుకోవాలని కోరారు. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందరనే తెలువదా?, ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో ప్రశ్నించండి.. నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతారని ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా డీజీపీని కోరారు.

Next Story

Most Viewed