- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్ధిక్ పాండ్యా, బుమ్రాపై పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొద్ది రోజులుగా గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ఓ వైపు గాయాలు, ఫామ్ లేని కారణంగా భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇదిలా ఉండగా హర్దిక్ వెన్నెముక సమస్యపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ మాట్లాడుతూ.. నేను దుబాయ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యాతో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే చాలా సన్నగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొద్ది రోజులుగా గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ఓ వైపు గాయాలు, ఫామ్ లేని కారణంగా భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇదిలా ఉండగా హర్దిక్ వెన్నెముక సమస్యపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అక్తర్ మాట్లాడుతూ.. నేను దుబాయ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యాతో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే చాలా సన్నగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా బలంగా లేవని అనిపించింది. అప్పుడు నువ్వు త్వరలోనే గాయపడతావని పాండ్యాను హెచ్చరించినట్టు తెలిపాడు. తాను అలా చెప్పిన గంటన్నరకే హార్దిక్ గాయపడినట్టు అక్తర్ చెప్పుకొచ్చాడు.
అయితే.. 2018 ఆసియా కప్ సందర్భంగా పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడికి వెన్నెముక సమస్య అతడిని వెంటాడింది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పాండ్యా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి పాండ్యాను ఈ సమస్య వేధిస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో ఫిటెనెస్ లేకపోవడంతో ఇటీవల బౌలింగ్ చేయడం లేదు. అంతేకాకుండా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్‌లోనూ పాండ్యా పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో తర్వలో జరగబోయే దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టులో ప్లేస్ కోల్పోయాడు.






