చై-సామ్ డివోర్స్ ఆమెకు ముందే తెలుసా.. హాట్ టాపిక్‌గా శిల్పారెడ్డి..

by  |
చై-సామ్ డివోర్స్ ఆమెకు ముందే తెలుసా.. హాట్ టాపిక్‌గా శిల్పారెడ్డి..
X

దిశ, వెబ్‌డెస్క్ : విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఏ చిన్న పని చేసినా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సామ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే తిరుమలలో సమంత పక్కన ఉన్న అమ్మాయిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? గత కొంత కాలం నుంచి సమంత ప్రతి అడుగులో ఆమె ఎందుకు ఉంటుందని ముచ్చటిస్తున్నారు. అలాగే విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత నుంచి సామ్ తీర్థయాత్రల్లో కానీ, మామూలు సమయాల్లో కానీ ఎక్కడ చూసినా సమంత పక్కన ఆ అమ్మాయి కనిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇక సమంత ఆమెకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తోంది. ఎందుకు ఎక్కువ ఆమెతోనే సామ్ టైమ్ స్పెండ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే కొంత మంది అంటారు. కష్టం సుఖం చెప్పుకోవడానికి ఒకరుండాలని, అలానే చై నుంచి విడిపోయాక సామ్‌కి తన అని , తన బాధలను పంచుకునే వారెవరైన ఉన్నారా..అంటే అది శిల్పారెడ్డి అని చెప్పవచ్చు. చైతో విభేదాల గురించి ప్రతి విషయం సామ్ శిల్పాతోనే పంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకే సామ్‌కి శిల్పారెడ్డి అంత ప్రత్యేకమని చెప్పాలి. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనర్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన శిల్పారెడ్డితో చాలా ఏళ్లుగా సమంతకు పరిచయం ఉంది. పరిశ్రమతో సంబంధం లేకున్నా వీరి పరిచయం గొప్ప స్నేహంగా మారింది. వ్యాయామం, ఫుడ్ విషయంలో శిల్పారెడ్డి చెప్పిన ప్రతీది సామ్ ఫాలో అవుతోంది. ఇక స్నేహానికి ఎంతో విలువనిచ్చే సమంత శిల్పారెడ్డిని అమితంగా ఇష్టపడుతారని, తన ప్రతి ఎమోషన్‌ను శిల్పాతోనే షేర్ చేసుకుంటోందని తెలుస్తోంది.

Read more news:

సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?

పుష్పలో ఐటమ్ సాంగ్.. సమంత‌పై కేసు నమోదు ?

పంటచేనుకు సమంత రక్షణ..

Next Story

Most Viewed